‘పదోన్నతుల్లో అన్ని ఖాళీలూ ప్రదర్శించాలి’
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

‘పదోన్నతుల్లో అన్ని ఖాళీలూ ప్రదర్శించాలి’

రాజానగరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల నెలవారీ పదోన్నతులలో బ్లాక్‌ చేసిన ఖాళీలు చూపించకపోవడం విద్యార్థులకు అన్యాయం చేయడమేనని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్‌ అన్నారు. దివాన్‌చెరువులో ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలల్లో బ్లాక్‌ చేసిన కేటగిరీ 1, 2 ఖాళీలు ఏడాదిగా సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోందన్నారు. వాటిని పదోన్నతులలో భర్తీ చేయకపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఉన్నతాధికారుల స్పందించి దీనిని సరిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఆడిటర్‌ ఎస్‌.జె.త్రినాథ్‌బాబు, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకరకుమార్‌, శామ్యూల్‌సన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని