దయార్ద్ర హృదయం.. దీనురాలికి అభయం
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

దయార్ద్ర హృదయం.. దీనురాలికి అభయం


వైద్య సేవల అనంతరం చిరునవ్వుతో..

 

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కొద్దిరోజులుగా ఆహారం లేకుండా మృత్యువుతో పోరాడుతూ గాంగ్రిన్‌ (రక్తం సరఫరా కాకపోవడంతో కణాలు చచ్చుపడడం) వ్యాధితో బాధపడుతున్న అనాథ మహిళకు వ్యక్తిగత శుభ్రత కరవై ఆ ప్రాంతమంతా విపరీతమైన దుర్వాసన వ్యాపించింది. ఉదయపు నడకకు అటుగా వచ్చిన కొందరు ఇచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరానికి చెందిన జైన్‌ సేవా సమితి స్పందించింది. సమితి అధ్యక్షుడు విక్రమ్‌ జైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంభం సత్రం వీధిలో చెత్త కుండీ పక్కన ఓ మహిళ నిస్సహాయంగా పడి ఉంది. తక్షణమే సమితి సభ్యులంతా కలిసి సమీపంలోని కుళాయి వద్ద స్నానం చేయించి ఆమెకు దుస్తులు వేయించారు. వ్యాధి కారణంగా ఆమె చెయ్యి కుళ్లిపోయింది. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు సహాయపడేందుకు సమితి తరఫున ఒక మనిషిని ఏర్పాటు చేశారు. త్వరలోనే వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేస్తారన్నారు. పేరు అమరావతి అని, వెనుకా ముందూ ఎవరూ లేరని ఆమె చెప్పింది. పూర్తిగా కోలుకునేంత వరకు వైద్యం చేయించి సమితి ఆధ్వర్యంలోనే ఆమెకు శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించినట్లు విక్రమ్‌ జైన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని