అక్కల్ని కాపాడబోయి సముద్రంలో గల్లంతు
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

అక్కల్ని కాపాడబోయి సముద్రంలో గల్లంతు


బాలరాజు

 

కాట్రేనికోన: సముద్రంలో స్నానాలకు వెళ్లిన ఆనందం ఆ ఇంట అంతులేని విషాదంగా మారింది. నలుగురు అక్కల తరువాత పుట్టిన తమ్ముడు కడలిలో గల్లంతైన ఘటనతో వారంతా బోరున విలపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాట్రేనికోన మండలం గచ్చకాయలపోరకు చెందిన మల్లాడి సత్యనారాయణ, మావుళ్లమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు బాలరాజు(18) సంతానం. జీవనోపాధి నిమిత్తం వీరంతా గుంటూరులో ఉంటున్నారు. దసరా పండుగకు ఇక్కడికొచ్చారు. గురువారం బాలరాజు తన అక్కలతో కలిసి గచ్చకాయలపోర సముద్రతీరానికి వెళ్లారు. స్నానానికి దిగిన కాసేపటికి ఇద్దరు అక్కలు మునిగిపోతుండగా కాపాడే యత్నంలో బాలరాజు గల్లంతయ్యాడు. అతని అక్కలను మత్స్యకారులు రక్షించి ఒడ్డుకుచేర్చారు. అతనికోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ముమ్మిడివరం సీఐ జానకిరామ్‌ వచ్చి గాలింపు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని