బ్యాంకు రుణాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

బ్యాంకు రుణాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు


లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న ఎంపీలు, మంత్రి, కలెక్టర్‌, అధికారులు

గాంధీనగర్‌(కాకినాడ): చిన్నచిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు అందడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఆదేశాల మేరకు జిల్లా లీడ్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో భారీ రుణ వితరణ మహోత్సవం జరిగింది. కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు, ఎంపీలు బోస్‌, గీత, అనురాధ, కలెక్టర్‌ హరికిరణ్‌ పాల్గొన్నారు. 32 స్టాళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ 19,701 మందికి రూ.600 కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా, రుణ వితరణ మహోత్సవంలో భాగంగా 16,892 మంది లబ్ధిదారులకు రూ.425 కోట్లు అందించిన బ్యాంకులకు ధన్యవాదాలు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మినీ బ్యాంకులుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకర్లు సహాయం తోడు కావాలన్నారు. ఎంపీలు మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, కె.ఎన్‌.వి.చిన్నారావు, ఎస్‌బీఐ ఆర్‌ఎం నరసింహామూర్తి, నాబార్డ్‌ డీడీఎం వై.సోమినాయుడు, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని