క్రీడా సంఘాల ధ్రువపత్రాలు సమర్పించాలి
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

క్రీడా సంఘాల ధ్రువపత్రాలు సమర్పించాలి

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జాతీయ క్రీడల అభివృద్ధి కోడ్‌-2011 నిబంధనల ప్రకారం జిల్లాలోని క్రీడా సంఘాలు, జిల్లా ఒలింపిక్‌ సంఘం, రాష్ట్ర సంఘం అనుబంధంగా ఉన్నవి కూడా.. ధ్రువపత్రాలు, సభ్యుల వివరాలను పది రోజుల్లో తమ కార్యాలయంలో అందజేయాలని జిల్లా యువజన సేవలు- స్టెప్‌ సీఈవో వి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాల అటెస్టెడ్‌ నకళ్ల ప్రతులను అందజేసిన సంఘాల సమాచారాన్ని విజయవాడలోని శాప్‌ కార్యాలయానికి పంపుతామన్నారు. వివరాలకు జిల్లా స్టెప్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 
నేడూ పింఛన్ల పంపిణీ 
 గుంటూరు: వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకం లబ్ధిదారులకు జులై నెలకు సంబంధించి పింఛన్లను ఈనెల 4న కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు 5,57,625 మందికి రూ.133.22 కోట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. 95.31 శాతం మందికి పింఛన్లు అందాయి. మిగిలిన 27,444 మందికి బుధవారం పంపిణీ చేయనున్నారు. మంజూరైన ప్రతి లబ్ధిదారునికి సొమ్ము అందజేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని