విజయోత్సవాలకు అనుమతి లేదు
eenadu telugu news
Published : 20/09/2021 02:59 IST

విజయోత్సవాలకు అనుమతి లేదు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించడం, విజయోత్సవాలు చేసుకోవడానికి అనుమతి లేదేని అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. గుంటూరులోని ఆంధ్రా లూథరన్‌ బీఈడీ కళాశాలలో తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, పెదకాకాని మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో అభ్యర్థులు, ఏజెంట్లతో మాట్లాడి ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడచుకోవాలని వారికి సూచించారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పరిషత్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ధ్రువపత్రం స్వీకరించడానికి అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. సమస్యాత్మక గ్రామాలైన కోవెలమూడి, ముట్లూరు, నంబూరు తదితర గ్రామాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించవద్దని అభ్యర్థులను కోరారు. డీఎస్పీలు సుప్రజ, సీతారామయ్య, సీఐలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని