‘ఏ ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైంది.. రీసర్వే’
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

‘ఏ ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైంది.. రీసర్వే’

యడ్లపాడు, న్యూస్‌టుడే : వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా రైతులు ఉచితంగా శాశ్వత భూ యాజమాన్య హక్కు పత్రాలు పొందటంతో పాటు సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రికలో గురువారం రీ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. డ్రోన్‌ ఎగరడాన్ని పరిశీలించారు. రీ సర్వే కార్యాచరణ ప్రణాళికలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వే గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైన కార్యక్రమని, దీన్ని ఆధునిక పద్ధతుల్లో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో మాధురి, ఎంపీపీ పి.ఝాన్సీ, జడ్పీటీసీ ముక్తా వాసు, సర్పంచి కారుచోల హేమ, సర్వేయర్‌ రాంబాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని