చర్లపల్లిలో మాస్కుల పంపిణీ
logo
Published : 29/03/2020 16:57 IST

చర్లపల్లిలో మాస్కుల పంపిణీ

చర్లపల్లి: చర్లపల్లి డివిజన్ పరిధిలోని అంబేడ్కర్‌కాలనీ, చర్చి కాలనీ, ఇందిరాగృహకల్పకాలనీ ప్రజలకు మేడ్చల్ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు కొమ్ము నరసింగరావు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. నిత్యావాసరాల కోసం బయటకు వెళ్లిన వారు సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా డివిజన్‌ అధ్యక్షుడు డి.నాథం సీనియర్‌ నాయకులు పాండు, ముదిరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని