
అక్కడ సిట్టింగ్లదే గెలుపు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతాన్ని బట్టి కూడా అభ్యర్థుల గెలుపోటములను సాధారణంగా అంచనా వేస్తుంటారు. బల్దియాకు తాజాగా జరిగిన ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప ఓటింగ్ శాతం పోలైన డివిజన్లను పరిశీలిస్తే.. వాటిల్లో ఎక్కువ స్థానాలను సిట్టింగ్ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే దక్కించుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ, తక్కువ పోలింగ్ నమోదైన 17 స్థానాలను తీసుకుంటే.. వాటిల్లో 15 చోట్ల ఆయా పార్టీలే జయకేతనం ఎగురవేశాయి. రెండు చోట్ల మాత్రమే ఓటర్లు కొత్త వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆర్సీపురం, భారతీనగర్, గాజులరామారం, బౌద్ధనగర్, రంగారెడ్డినగర్ స్థానాలను తెరాస నిలబెట్టుకుంది. పటాన్చెరు గతంలో కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. అనంతరం అక్కడి కార్పొరేటర్ తెరాసలో చేరారు. ఈ స్థానాన్ని కూడా ప్రస్తుతం తెరాస గెల్చుకుంది.
* నవాబ్‌సాహెబ్‌కుంట, దత్తాత్రేయనగర్, జంగమ్మెట్‌లో మజ్లిస్ పట్టు నిలబెట్టుకుంది.
* యసుఫ్గూడ, మియాపూర్, హైదర్‌నగర్‌లో తెరాస విజయం సాధించగా.. విజయ్‌నగర్‌కాలనీ, సంతోష్‌నగర్, మెహిదీపట్నంను ఎంఐఎం తిరిగి గెల్చుకుంది.
* అమీర్‌పేట, వసారాంబాగ్లో తెరాస అభ్యర్థులను ఓడించి భాజపా అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు.