
టిప్పర్ లారీ ఢీ కొని ఇద్దరి మృతి
అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడికే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్(60), జంగయ్య(55) ద్విచక్ర వాహనంపై కూలీ పని నిమిత్తం కుంట్లూరు వెళ్తున్నారు. బండరావిరాల సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్లారీ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ మార్గంలో ప్రమాదాలకు కారణమవుతున్న టిప్పర్ లారీల దూకుడు తగ్గించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.