Published : 05/03/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పనులు ప్రారంభం.. ప్రజల అనందం

కేసారం రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీ నిర్మాణం

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: ఇన్నాళ్లూ రైల్వే గేటుకు వంతెన లేక వాహనదారులు గంటల తరబడి పాట్లు పడ్డారు. ఇలాంటి అవస్థలు ఇక కనుమరుగు కానున్నాయి. మండల పరిధిలోని కేసారం గ్రామానికి వెళ్లే మార్గంలోని రైల్వే గేటు దగ్గర పట్టాల కిందుగా వంతెన నిర్మాణ (రోడ్‌ అండర్‌ బ్రిడ్జ్‌, ఆర్‌యూబీ) పనులకు గురువారం అర్ధరాత్రి నుంచి గుత్తేదారు కసరత్తు ప్రారంభించారు. నెల రోజుల పాటు కొనసాగే వంతెన నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వంతెన నిర్మాణానికి రూ.2.50లక్షలను రైల్వే శాఖ కేటాయించినట్టు గుత్తేదారు తెలిపారు.


గుంతల పూడ్చివేత.. తీరేను చింత

తాండూరు-చించోళి అంతర్‌ రాష్ట్ర రహదారి మరమ్మతుల్లో భాగంగా ఇటీవల 660మీటర్ల వరకు రహదారిని జేసీబీతో చదును చేశారు. ఈక్రమంలో తారు కలిపిని కంకరను ఒకచోట కుప్పగా వేశారు. తాజాగా వాటిని రహదారిపై ఏర్పడిన గుంతల్లో వేసి ఆర్‌ అండ్‌ బి సిబ్బంది పూడ్చి వేస్తున్నారు. ఇదే విషయమై డీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..తాత్కాలిక మరమ్మతుకు పాతతారు వాడుతున్నట్లు తెలిపారు.

-న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని