Published : 12/05/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు గంటల్లోనే ప్రజా రవాణా

మెట్రో ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకే

ఈనాడు - హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ఉన్నా.. ప్రజా రవాణా అందుబాటులో ఉంది. అయితే సడలింపు సమయంలోనే ప్రయాణాలుంటాయి. మిగతా సమయంలో బస్సులు ఆర్టీసీ డిపోలకే పరిమితమౌతున్నాయి. ఉదయం 6 నుంచి 10గంటల వరకూ ఆర్టీసీ సిటీ బస్సులు నగరంలో తిరగనున్నాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. సిటీలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడుపుతున్నామన్నారు. మెట్రో రైళ్లు మాత్రం ఉదయం 7 గంటల నుంచి 8.45 గంటల వరకే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు నాగోలు, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, రాయదుర్గం, జేబీఎస్‌ మెట్రోస్టేషన్ల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయి. చివరి ట్రిప్పు ఉదయం 8.45 గంటలకు బయలుదేరుతాయి. లాక్‌డౌన్‌ 10 రోజులు ఇలాగే మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయాలతో సంబంధం లేకుండా విమానాలు, రైళ్లు తిరుగుతాయి. లాక్‌డౌన్‌ సమయంలో రైల్వేస్టేషన్‌కు, విమానాశ్రయానికి చేరాలనుకున్నవారు టికెట్‌ చూపిస్తే ప్రయాణాలకు అనుమతిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా.. అందుబాటులో..

నగరం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులు కూడా ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతాయని పేర్కొంది. దూర ప్రాంతాల బస్సులు కూడా ఉదయం 10 గంటలకు చేరేలా ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దూర ప్రాంత ప్రయాణికులు టికెట్‌ చూపించి ఇళ్లకు చేరేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నగరం నుంచి ఆదిలాబాద్‌కు 5 గంటల ప్రయాణం, భద్రాచలం - హైదరాబాద్‌ మధ్య కూడా 6 గంటలు పడుతుంది. మరి ఈ ప్రాంతాలకు వెళ్లే బస్సుల విషయంలో ఆర్టీసీ వద్ద స్పష్టత లేదు. ప్రయాణాలుంటాయని మాత్రమే ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని