బీసీ కుల, చేతివృత్తుల వారిని ఆదుకోవాలి
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీసీ కుల, చేతివృత్తుల వారిని ఆదుకోవాలి

సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య


మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య, చిత్రంలో జయంతి, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: కరోనా ప్రతికూల పరిస్థితులతో దెబ్బతిన్న బీసీ కుల, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల తరహాలో వారిని ఆదుకోవడానికి రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, లేదంటే ఒక్కో కుటుంబానికి రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మంగళవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కుల వృత్తులు దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేతలు నీల వెంకటేశ్‌, ఉదయ్‌నేత, జయంతి, నిఖిల్‌, రవి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని