కొండాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం: మహిళ మృతి
eenadu telugu news
Published : 02/08/2021 16:05 IST

కొండాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఒకరిని కెనడాలో ఎంటెక్ చదువుతున్న ఆశ్రితగా గుర్తించారు. అభిషేక్ అనే వ్యక్తి కారును నడిపినట్లుగా పోలీసులు తెలిపారు. అర్థరాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో నలుగురు కారులో అతివేగంగా వస్తూ అదుపుతప్పి కొండాపూర్‌ మై హోం వద్ద ప్రమాదం జరిగిందని గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని