శిక్షణ, వ్యాపార మెలకువలు నేర్పుతున్నాం
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

శిక్షణ, వ్యాపార మెలకువలు నేర్పుతున్నాం

తెలుగు రాష్ట్రాల సంచాలకులు విశ్వనాథరెడ్డి

సిద్దిపేటలో మాట్లాడుతున్న విశ్వనాథరెడ్డి

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: శిక్షణార్థులకు తర్ఫీదులో నైపుణ్యం పెంపొందించడంతో పాటు వ్యాపార మెలకువలు నేర్పుతున్నామని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల (ఆర్‌ఎస్‌ఈటీఐఎస్‌) తెలుగు రాష్ట్రాల సంచాలకులు విశ్వనాథరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేటలోని యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఆయన సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. నేర్చుకున్న అంశాలు, నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సిద్దిపేటలోని కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 3168 మంది నిరుద్యోగ యువత తర్ఫీదు పొందారని చెప్పారు. వీరిలో 2250 మంది స్థిరపడ్డారని తెలిపారు. 1300 మంది శిక్షణార్థులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం నిర్వహణపై సంస్థ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, సిబ్బంది నజీం, నాగరాజులను అభినందించారు. అనంతరం స్థానిక డైరెక్టర్‌ మాట్లాడుతూ.. అక్టోబరులో యువకులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, రిఫ్రిజిరేటర్‌, సీసీ టీవీ మరమ్మతులు, సెల్‌ఫోన్‌ సర్వీసింగ్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వారు వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు దుబ్బాక, పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న టైలరింగ్‌, జనపనార ఉత్పత్తుల తయారీ శిక్షణ కేంద్రాలను సందర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని