బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి మరో రికార్డ్‌
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి మరో రికార్డ్‌

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: వినాయక ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలంపాట ద్వారా ప్రత్యేకత సొంతం చేసుకున్న బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితికి యూనివర్శల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసినట్లు భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు కేవీ రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును పలు దేవాలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి, వేలం పాటలో గెలుపొందిన వ్యక్తిని ఏటా సరికొత్త ప్రపంచ రికార్డులలో నమోదు చేసే ప్రక్రియలో భాగంగా ఈ సంవత్సరం యూనివర్శల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని నిర్వాహకులకు అందచేసినట్లు ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని