Telangana Corona update: తెలంగాణలో కొత్తగా 216 కొవిడ్‌ కేసులు
eenadu telugu news
Published : 27/09/2021 22:18 IST

Telangana Corona update: తెలంగాణలో కొత్తగా 216 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 44,584 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 216 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,65,284కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,914కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 241 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,56,785కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,585 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని