చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 18/10/2021 04:04 IST

చిత్ర వార్తలు

దుర్గమ్మా.. వెళ్లి రావమ్మా!

వ రాత్రోత్సవాలు ముగియడంతో ఆదివారం పెద్దసంఖ్యలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. భక్తుల కోలాహలం, నృత్యాల మధ్య శోభా యాత్రలు జరిగాయి. ఉదయం పదిగంటల సమయంలో తెలుగుతల్లి పైవంతెన వద్ద దుర్గామాత విగ్రహాలు ఇలా బారులు తీరి కనిపించాయి

రమణీయం

అందమైన ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలు పోయారు. చూడ ముచ్చటైన చీరకట్టుతో పాటు సంప్రదాయ, ఆధునిక దుస్తులు, ఆభరణాలతో మెరిసిపోయారు. ఆదివారం మాదాపూర్‌లో ఏర్పాటైన ఫ్యాషన్‌ షో విశేషంగా ఆకట్టుకుంది.


గీత దాటొద్ధు. ప్రమాదం దరి చేరొద్దు

హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఉన్న కొండ నుంచి రాళ్లు జారిపడుతున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో వాహనాలకు ప్రమాదాలు జరక్కుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు.


రియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం జల విహార్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌లో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా, రెడ్డి ల్యాబ్స్‌ సీఈవో జీవీ ప్రసాద్‌, ఏఐజీ ఛైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమా దాట్ల, మహిళా పైలట్‌ రేష్మా రజ్వానీలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని