దూడకు పుట్టినరోజు వేడుక
eenadu telugu news
Updated : 27/09/2021 12:24 IST

దూడకు పుట్టినరోజు వేడుక

దూడను ఊరేగిస్తున్న గ్రామస్థులు

సుండుపల్లి, న్యూస్‌టుడే : సుండుపల్లి మండలం ఎగువ ఈడిగపల్లెలో ఆదివారం ఒక ఆవుదూడ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బండల శంకర్‌ పోషిస్తున్న ఆవుకు 2020లో జన్మించిన దూడను అవధూత కాశినాయన మఠానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఆ దూడ మొదటి పుట్టినరోజు కావడంతో గ్రామస్థులను ఆహ్వానించి కేక్‌ కోశారు. అన్నవితరణ కార్యక్రమం నిర్వహించి ప్రేమను చాటుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని