చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 20/10/2021 04:42 IST

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


సుబ్బరాయుడు 

చెన్నూరు, న్యూస్‌టుడే: కువైట్‌కు వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపానికి గురై ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌.ఐ.శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రభారతిపేటకు చెందిన సుబ్బరాయుడు (42) పులివెందులకు చెందిన సునీతను కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవనోపాధి కోసం దంపతులు కువైట్‌కు పదేళ్ల కిందట వెళ్లారు. నాలుగేళ్ల కిందట సుబ్బరాయుడు స్వగ్రామానికి వచ్చాడు. సునీత అక్కడే ఉండిపోయింది. ఇటీవల ఆమెను తిరిగి రావాలని కోరుతున్నా ఆమె రాలేదు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 17వ తేదీ ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికులు కొనఊపిరితో ఉన్న అతన్ని కడపలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు ఎస్‌.ఐ.తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని