క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
eenadu telugu news
Published : 20/10/2021 05:01 IST

క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి


క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న వైద్యులు సురేష్‌, గోవవర్ధన్‌రెడ్డి, చీఫ్‌ కోచ్‌

కడప క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడాకారుల లక్ష్యం ఎప్పుడూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎస్‌ఏ స్టేడియంలో జిల్లా స్థాయి సీనియర్‌ పురుష, మహిళల కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు వంద మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. చీఫ్‌ కోచ్‌ బాషా మొహిద్దీన్‌, డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో రాణించిన జట్టులోని క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తానన్నారు. కోశాధికారి, శిక్షకులు టి.జనార్ధన్‌రెడ్డి మాట్లాడారు. ఎంపికైన క్రీడాకారులు అనకాపల్లి తిమ్మరాజుపేటలో నిర్వహించే 69వ రాష్ట్ర స్థాయి సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. శిక్షకులు ప్రసాద్‌, జయచంద్ర, వాణి, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని