పట్టు తప్ఫి. క్షేమంగా గట్టుపైకి!
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

పట్టు తప్ఫి. క్షేమంగా గట్టుపైకి!

నీళ్లలో పడిపోతున్న తెప్ప

 

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను బల్దియా అధ్యక్షురాలు బోగ శ్రావణి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లాంఛనంగా వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తెప్పపై వెళ్తుండగా, ఒకే వైపు భారం పడటంతో ఆమెతో పాటు, మరో మహిళ వార్డు సభ్యురాలు పట్టుతప్పి నీటిలోకి జారిపోయారు. పక్కనే ఉన్న భర్త ప్రవీణ్‌, మరికొందరి సాయంతో బోగ శ్రావణిని గట్టుపైకి తీసుకెళ్లగా, మహిళ వార్డు సభ్యురాలు ఒడుపుగా వినాయకుని విగ్రహాన్ని ఆసరా చేసుకొని తెప్పపైకి చేరుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన వైరల్‌గా మారగా, తెప్ప చెరువు మధ్యలోకి చేరుకున్న తరువాత ఇదే ఘటన జరిగితే ప్రమాదానికి అవకాశం ఉండేదన్నారు. ఇబ్బంది లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని