మహిళలకు భరోసా ఇచ్చేది తెరాస ప్రభుత్వమే
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

మహిళలకు భరోసా ఇచ్చేది తెరాస ప్రభుత్వమే

రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు


మహిళా సంఘాల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇల్లందకుంటలో గురువారం మహిళ సంఘాల సభ్యులకు స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట మండల పరిధిలోని మహిళా సంఘాలకు రూ.1.84కోట్ల వడ్డీ లేని బ్యాంక్‌ లింకేజీ రుణాలను, రూ.1.30కోట్ల స్త్రీనిధి రుణాలను మహిళ సంఘాల సభ్యుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తున్నది తెరాస ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుతం రూ.2.36కోట్లతో 18గ్రామాలలో 18మహిళ సంఘ భవనాలను నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. మండల సమాఖ్య భవనానికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. భాజపా నాయకులు చెప్పే మాయ మాటలు...మోసపూరిత మాటలను నమ్మొద్దన్నారు. రాష్ట్రంలోని 930 గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.1.5లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు నెలలుగా ఇల్లందకుంట మండల పరిధిలో రూ.17కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, నాయకులు పింగిళి రమేశ్‌, సరిగొమ్ముల వెంకటేశ్‌, రాజిరెడ్డి, రఫీఖాన్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని