స్వార్థ రాజకీయాలకు తెరలేపిన ఈటల
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

స్వార్థ రాజకీయాలకు తెరలేపిన ఈటల

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

చెల్పూరులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వార్థ రాజకీయాలకు తెరలేపారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం హుజూరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో నిర్మించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే స్టాటర్ల్లు తప్ప ఒరిగిందేమీలేదన్నారు.  అనంతరం తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ సేవచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. అనంతరం చెల్పూరులో ధూంధాం కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మండలంలోని కనుకులగిద్దలో మంత్రి హరీశ్‌రావు మహిళలతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ రాణి, సింగిల్‌విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, సర్పంచులు కోడిగూటి శారద, మనోహర్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పలువురు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని