కొండపై పార్కింగ్‌ సమస్య
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

కొండపై పార్కింగ్‌ సమస్య


భారీగా నిలిచిన వాహనాలు

మల్యాల, న్యూస్‌టుడే : కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లే భక్తులు కొండపైన పార్కింగ్‌ సమస్యతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొండపైన బస్టాండు ముందు గల మాల విమరణ మండపం నిర్మాణం కోసం ప్రతిపాదించిన ఖాళీ స్థలంలో భక్తులు తమ వాహనాలను పార్కింగ్‌ చేసుకొంటున్నా అది సరిపోవడం లేదు. ప్రతి వారం శని, మంగళవారాలతో పాటు ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో కొండపైకి తరలిరావడంతో పార్కింగ్‌ సమస్య ఏర్పడుతుంది. కొండపైన ‘వై’ జంక్షను సమీపంలోని ఘాట్‌రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అధికారులు దాన్ని పార్కింగ్‌ కోసం చదును చేయడంలేదు. దీంతో భక్తుల రద్దీ సమయంలో వాహనాలు నిలపడానికి నానా తంటాలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఘాట్‌రోడ్డు పక్కన పార్కింగ్‌ స్థలం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని