close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అపోహలే ఘోరమై.. ఆ నలుగురూ కరవై

ముగ్గురితోనే సాగిన వెంకయ్య ‘అంతిమ’ ప్రయాణం

రోనా కరాళ నృత్యంలో తమవారి కడచూపునకూ నోచుకోని బాధితులెందరో. ఆ నలుగురూ కరవై అనాథ శవంలా అంత్యక్రియలకు భారంగా తీసుకెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇంకెన్నో. సాధారణ జబ్బులతో మృతిచెందిన వారిని సైతం కడదాకా మోసుకెళ్లేందుకు ‘ఆ నలుగురు’ దొరని ‘కరోనా’ కాలమిది. ఇలాంటి సంఘటన పాల్వంచ మండలం నాగారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(58)కు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆటోలో పాల్వంచలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లారు. కరోనా సోకి ఉండొచ్చన్న అపోహతో ఇరుగుపొరుగు, గ్రామస్థులెవరూ దహన సంస్కారాలకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు పంచాయతీ ట్రాక్టర్‌నైనా సమకూర్చాలని బాధితులు ప్రాధేయపడ్డారు. అయినా స్పందన లేదు. దీంతో రంజిత్‌కుమార్‌ అనే రైతు 5 కి.మీ. దూరంలోనున్న తన పొలానికి వెళ్లి పుల్‌వీల్స్‌తో ఉన్న ట్రాక్టరు, ట్రక్కును తీసుకొచ్చారు. మరో ఇద్దరి సాయంతో వెంకయ్య మృతదేహాన్ని వాగు ఒడ్డుకు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ కష్టాన్ని తలచుకుని బాధిత కుటుంబీకులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన దృశ్యాలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

- పాల్వంచ (పెద్దమ్మగుడి), న్యూస్‌టుడే

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.