5422 మందికి టీకా
logo
Published : 20/06/2021 03:41 IST

5422 మందికి టీకా

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో శనివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించి 5422 మంది లబ్ధిదారులకు టీకా పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు. మొత్తం 21 కేంద్రాల్లో కొవాగ్జిన్‌, 12 కేంద్రాల్లో కొవీషీల్డ్‌ టీకా అందించామని వివరించారు. నేడు కూడా యధావిధిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు.

340 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 7013 మందికి కొవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా 340 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ శనివారం నివేదికలో పేర్కొంది.జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఆదివారం నుంచి కొవిషీల్డ్‌ టీకా ఇస్తారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని