Published : 03/07/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిది గంటల విద్యుత్‌సరఫరాకు వినతి

సీ.బెళగల్‌: మండలంలోని గుండ్రేవుల, కొత్తకోట, కొండాపురం, ముడుమాల, సంగాల నదీతీర గ్రామాల రైతులు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని శుక్రవారం మండల విద్యుత్‌ శాఖ ఏఈ కె.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తుంగభద్ర నదిలో నీరు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇస్తున్న 6గంటల విద్యుత్‌ ఏమాత్రం సరిపోవడంలేదని, తొమ్మిది గంటలు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నదీతీర గ్రామాల రైతులు వరిపంట సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారని వివరించారు. ఆరు గంటల విద్యుత్‌తో కూలీ రేట్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్‌రెడ్డి, గోవింద్‌, సయ్యద్‌, తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని