close

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
16 నుంచి విద్యా కానుక కిట్ల సరఫరా

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యార్థులకు రాత పుస్తకాల కిట్‌ను మండల కేంద్రాలకు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాకానుక కిట్లు జిల్లా కేంద్రానికి చేరాయి. తొమ్మిది రకాల వస్తువులను ఎమ్మార్సీ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి ఒక కిట్‌ చొప్పున స్కూల్‌ ప్రారంభం రోజున అందజేస్తారు. విద్యా కానుక కిట్లను 16న కర్నూలు, కల్లూరు, 17న ఎమ్మిగనూరు, ఆదోని, పెద్దకడబూరు, 18న కోడుమూరు, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, 19న గూడూరు, సి.బెళగల్‌, నందవరం, మంత్రాలయం, కోసిగి., 20న గోనెగండ్ల, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, హొళగుంద, 21న కౌతాళం, హాలహర్వి, గడివేముల, పగిడ్యాల, మిడుతూరు, 22న జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు, కొత్తపల్లి, శ్రీశైలం, 23న వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, నంద్యాల, చాగలమర్రి, 24న ఓర్వకల్లు, పాణ్యం, శిరువెళ్ల, గోస్పాడు, రుద్రవరం, ఆళ్లగడ్డ, 25న నందికొట్కూరు, డోన్‌, కృష్ణగిరి, ప్యాపిలి, వెల్తుర్ది, 26న బేతంచెర్ల, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, 27న కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు సరఫరా చేయనున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.