Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెట్లను నరికేసి.. ప్రమాదాన్ని ఉంచేసి!


భారీ వృక్షం నరికేయడంతో మిగిలిన మొదలు

రహదారి విస్తరణ మంచిదే. దాన్ని సాకుగా చూపి పచ్చని చెట్లను తొలగించడం సబబు కాదు. ఆళ్లగడ్డ- అహోబిలం రహదారి విస్తరణ పనులు ఈ మధ్యనే దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా రహిమాన్‌ బంకు సమీపంలో జరిగిన పనుల్లో నాలుగు చెట్లను నరికేశారు. విస్తరణ పనులకు అడ్డుగా లేకున్నా వందేళ్లున్న భారీ వృక్షాన్నీ కూల్చేశారు. అక్కడే రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు నియంత్రికను మాత్రం తొలగించకపోవడం గమనార్హం. రోడ్డుకు అడ్డమని వృక్షాలను తొలగించిన అధికారులు, ప్రమాదకరంగా ఉన్న నియంత్రికను తొలగించకపోవడం దారుణమని పట్టణవాసులు వాపోతున్నారు. ఆర్‌ అండ్‌ బీ ఏఈ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. చెట్లను తొలగించినట్లు తనకు తెలియదని, ఈ ఘటనపై విచారణ చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

తొలగించని విద్యుత్తు నియంత్రిక


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని