అనుమానితులకుతక్షణమే జ్వర పరీక్షలు
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

అనుమానితులకుతక్షణమే జ్వర పరీక్షలు

అధికారులతో సమీక్షిస్తున్న జేసీ (అభివృద్ధి) డా.మనజీర్‌ జిలానీ సామూన్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కారణాలు అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాలని జేసీ (అభివృద్ధి) డా.మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులు, పారిశుద్ధ్యంపై వైద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఆరోగ్య కార్యకర్తలు తదితరులతో ఇంటింటికి వెళ్లి జ్వరం నిర్ధారణ పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్యను ఆదేశించారు. అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేయాలన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. లార్వా నియంత్రణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, ఇళ్ల మధ్యలో నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీవో ప్రభాకర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌పీవోలు, వైద్య, ఆరోగ్య శాఖతోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని