AP News: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు పట్టివేత
eenadu telugu news
Published : 24/10/2021 12:30 IST

AP News: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు పట్టివేత

పంచలింగాల: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా నగదు గుర్తించారు. బీదర్‌కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తుండగా సెబ్ సిబ్బంది కారును ఆపి తనిఖీ చేయగా రూ.75లక్షల నగదు కనిపించింది. నగదుకు రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సెబ్‌ అధికారులు నగదును సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీస్ స్టేషన్‌లో నగదు అప్పగించినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని