ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ.. అంతేసంగతి!
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ.. అంతేసంగతి!

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో మితిమీరుతున్న తీరు
చెత్తలో పాలిథీన్‌ సంచులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలికలో విచ్చలవిడిగా పాలిథీన్‌ సంచుల వినియోగం పెరుగుతోంది. టీకొట్టు మొదలుకొని బట్టల దుకాణం వరకు అన్ని వస్తువులు పాలిథీన్‌ సంచుల్లోనే తీసుకెళుతున్నారు. అధికారులు దాడులు నిర్వహించి కొన్ని సంచులను పట్టుకుని జరిమానాలు విధిస్తున్నా తరువాత షరామాములుగా వ్యాపారులు వినియోగిస్తునే ఉన్నారు. గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లోని చాలా హోటళ్లలో తినుభండారాలను ప్లాస్టిక్‌ సంచుల్లోనే ఇస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై జాతీయ కాలుష్య నియంత్రణ మండలి విధించిన నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించటంతోపాటు, కేసు నమోదు చేయాలని ఆదేశాలున్నాయి. వీటి అమలు గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో కాగితాలకే పరిమితమవుతోంది. పురపాలికలో 11 వేల నివాసాలున్నాయి. 55 వేల జనాభా ఉంది. రోజూ 18 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. వీటిలో సింహభాగం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లోని పదార్థాలు తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం వద్దని అవగాహన కల్పించాల్సిన నాయకులు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీలు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రజ్ఞాపూర్‌ నుంచి గజ్వేల్‌ వరకు దుకాణాల ప్రారంభోత్సవాలు, పండుగలు, ఎవరైనా మృతి చెందితే నివాళికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ ఆధారిత ఫ్లెక్సీలు తగ్గిస్తే కొంత మేలు జరుగుతుంది.

తనిఖీలతో నియంత్రిస్తున్నాం - వెంకటగోపాల్‌, ఇన్‌ఛార్జి కమిషనరు

పాలిథీన్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. జరిమానాలు విధిస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని