1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి..
eenadu telugu news
Published : 22/09/2021 02:28 IST

1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి..

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం శోచనీయమని, ఎక్కడైనా చిన్నారులను చిత్రహింసలకు గురి చేస్తుంటే వెంటనే 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ చందనా దీప్తి సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల రక్షణ జిల్లాగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పిల్లలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరగనివ్వాలని, ఆ విధంగా చేయడం తల్లిదండ్రులు బాధ్యతగా భావించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని