ప్రత్యక్ష తరగతులకు 45 శాతం హాజరు: డీఈవో
eenadu telugu news
Published : 22/09/2021 02:28 IST

ప్రత్యక్ష తరగతులకు 45 శాతం హాజరు: డీఈవో

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఈవో రమేశ్‌ కుమార్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ఈనెల 1న ప్రారంభించిన ప్రత్యక్ష బోధన తరగతులకు ప్రస్తుతం 45 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని జిల్లా విద్యాధికారి రమేశ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన నర్సాపూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారం రోజుల్లో విద్యార్థుల హాజరును 70 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న జిల్లా స్థాయిలో మెదక్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కౌడిపల్లి: పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని డీఈవో రమేశ్‌ కుమార్‌ తెలిపారు. కౌడిపల్లి మండలం తునికి ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని