పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
logo
Published : 18/06/2021 02:58 IST

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ పట్టణంలోని పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. పట్టణ శివారులోని ఎస్‌టీపీ ప్లాంట్‌ వద్ద ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలసి పరిశీలించి మాట్లాడారు. పార్కుల్లో అంతర్గతంగా ఉన్న ముళ్ల పొదలను తొలగించాలని సూచించారు. నడకదారితోపాటు, చిన్నారులు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో రాంబాబు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.  
రోగులను ఆదుకోవడం అభినందనీయం
నీలగిరి: కరోనా నివారణ కోసం ప్రభుత్వ లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి కోల్పోయిన కుష్టు రోగుల  ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన గాస్పర్‌ ట్రైబల్‌ సోషల్‌ సర్వీసెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని లెప్రసీ కాలనీలోని 152 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసి మాట్లాడారు. సంస్థకు తాను అన్ని విధాలుగా సాయం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో జగీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు తీగల జాన్‌శాస్త్రీ, సంస్థ ప్రతినిధులు మురళి కృష్ణారెడ్డి, అశోక్కుమార్‌, పీటర్‌, పాస్టర్‌ సామేల్‌ పాల్గొన్నారు.
పేదలకు భరోసా
నల్గొండ అర్బన్‌: రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నియోజక వర్గానికి చెందిన 302 మందికి మంజూరైన రూ. 1.16 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను గురువారం స్థానిక కార్యాయలంలో అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పేద ప్రజలకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తూ పాలన సాగిస్తున్నారని తెలిపారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ అబ్బగోని రమేష్‌, నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌, రామరాజు పాల్గొన్నారు.
చండూరు: చండూరు పురపాలిక పరిధిలో 35 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఛైర్‌పర్సన్‌ తోకల చంద్రకళ గురువారం తహసీల్దారు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్‌పర్సన్‌ దోటి సుజాత, తహసీల్దారు మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్‌, గుంటి వెంకటేశం, కొన్రెడ్డి యాదయ్య  పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని