హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు, మరొకరికి జరిమానా
logo
Published : 18/06/2021 02:58 IST

హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు, మరొకరికి జరిమానా

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష, మరొకరికి జరిమానా విధిస్తూ సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.కళ్యాణ్‌ చక్రవర్తి గురువారం తీర్పు వెలువరించారు. 2011 జనవరి 14న మోతెకు చెందిన అంజయ్య సంక్రాంతి పండుగ సందర్భంగా వీధిలో పందిని కాల్చారు. అంజయ్య, అతడి కుటుంబ సభ్యులను లింగయ్య(30), భిక్షం(29) దూషించారు. ప్రశ్నించిన వారిపై గొడ్డలి, కర్రలతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు లింగయ్య, భిక్షంపై కేసు నమోదు చేసి హత్యాయత్నంతో పాటు వివిధ నేరాలపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. 14 మంది సాక్షులను విచారించిన సూర్యాపేట అసిస్టెంట్‌ సెషన్స్‌ న్యాయస్థానం నేరాన్ని నిర్ధారించి నిందితులిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 2018లో తీర్పు వెలువరించింది. శిక్షపై నిందితులు జిల్లా న్యాయస్థానానికి అప్పీలు చేసుకున్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన రెండో అదనపు జిల్లా న్యాయస్థానం మొదటి నిందితుడు లింగయ్యపై హత్యాయత్నం నేరాన్ని నిర్ధారించి దిగువ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. రెండో నిందితుడు భిక్షంపై హత్యాయత్నం నేరాన్ని కొట్టిసి గాయపర్చిన నేరానికి రూ.3వేల జరిమానా ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పి.పి.కేసు వాదించగా లైసన్‌ ఆఫీసర్‌ వి.కృష్ణారెడ్డి ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని