ఆన్‌లైన్‌ తరగతులు సమర్థంగా నిర్వహించండి
eenadu telugu news
Published : 27/07/2021 04:20 IST

ఆన్‌లైన్‌ తరగతులు సమర్థంగా నిర్వహించండి


రావులపెంటలో ఆన్‌లైన్‌ తరగతుల తీరుపై ఆరాతీస్తున్న డీఈవో భిక్షపతి

వేములపల్లి, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల బోధన లేనందున ఆన్‌లైన్‌ తరగతులను సమర్థంగా నిర్వహించాలని డీఈవో భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్‌ పాఠశాలను సోమవారం సందర్శించి ఆయన మాట్లాడారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్‌ తరగతులు వినేలా గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సందేహాలను నివృత్తిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా కృషిచేయాలన్నారు. ఉపాధ్యాయులు అమరేందర్‌రెడ్డి, అజ్మతున్నీస, ఖాజామొహినొద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని