సమస్యల పరిష్కారానికి కృషి
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

సమస్యల పరిష్కారానికి కృషి

సూర్యాపేటలో మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటపెల్లి జనార్దన్‌ రెడ్డి

సూర్యాపేట(మహాత్మాగాంధీ రోడ్డు), న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి పీఆర్‌టీయూ టీఎస్‌ నిరంతరం కృషి చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటపెల్లి జనార్దన్‌ రెడ్డి అన్నారు. పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సాధించిన ప్రతి జీవోను ఉపాధ్యాయులు, సభ్యులకు వివరించి యూనియన్‌లో చేరే విధంగా త్వరలోనే 398 ఇంక్రిమెంట్‌ సాధిస్తామన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, పాఠశాలల బలోపేతం, మౌళిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరేల్లి కమలాకరరావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్‌, వీరబాబు, రామలింగారెడ్డి, చెరుకు శ్రీను, దొంగర మహేష్‌, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని