తుపాకి తూటా యోధుడు గంగయ్య కన్నుమూత
eenadu telugu news
Updated : 19/09/2021 02:10 IST

తుపాకి తూటా యోధుడు గంగయ్య కన్నుమూత

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని ఏపూర్‌కు చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు, తుపాకి తూటా యోధుడిగా పేరు గాంచిన వీరబోయిన గంగయ్య(90) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి చనిపోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భీంరెడ్డి నర్సింహరెడ్డి, మద్దికాయల ఓంకార్‌కు కొరియర్‌గా పనిచేసిన గంగయ్య తన జీవిత కాలమంతా కమ్యూనిస్టు పార్టీలో కొనసాగి పార్టీ ఆశయ సాధనకు పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా తనకు పింఛను మంజూరయ్యే అవకాశమున్నా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఇచ్చే సమర యోధుల పింఛను తీసుకోనని శపథం చేశారు. 1992లో ఏపూర్‌లో జరిగిన దొమ్మి సంఘటనలో 64 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ప్రధాన నాయకుడు నూకల వెంకట్రామ్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన అప్పటి సూర్యాపేట సీఐ లక్ష్మారెడ్డిని కమ్యూనిస్టులు అడ్డుకున్నారు. దీంతో సీఐ జరిపిన కాల్పుల్లో పోకబత్తిని వెంకట్రాములు, పోకబత్తిని భద్రయ్యతో పాటు వీరబోయిన గంగయ్యకు తూటా గాయాలయ్యాయి. గంగయ్య భుజంలోకి తూటా దూసుకుపోయింది. వీరిలో ఎవరూ చనిపోలేదు. అప్పట్నుంచి గంగయ్యను తుపాకి తుటా యోధుడుగా గ్రామస్థులు పిలిచేవారు. శనివారం గ్రామంలో భారీ ర్యాలీతో ఎర్ర జెండాలతో గంగయ్య అంత్యక్రియలు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని