స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలు అడ్డుకోవాలి
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలు అడ్డుకోవాలి

కర్నాల చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు

చివ్వెంల, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని నూతన కలెక్టరేఫట్‌ సమీపంలో కర్నాలకుంట చెరువు వద్ద స్థిరాస్తి వ్యాపారుల చేస్తున్న ఆగడాలను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం కర్నాలకుంటను సందర్శించిన నాయకులు మాట్లాడారు. చెరువు కట్టను, అలుగును ఇష్టారాజ్యంగా ధ్వంసం చేయడమే కాకుండా హరిత ట్రెబ్యునల్‌లో కేసు నడుస్తుండగా రాత్రికి రాత్రే దొంగచాటుగా మట్టి పోసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. చెరువు ఆక్రమణ, కట్ట, అలుగు ధ్వంసం తదితర వాస్తవ విషయాలను కనుమరుగు చేసేందుకే అక్రమార్కులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాయకులు కుంట్ల ధర్మార్జున్‌, రమాశంకర్‌, మాంద్ర మల్లయ్య, బుద్ద సత్యనారాయణ, ఘంటా నాగయ్య, బొడ్డు శంకర్‌, కునుకుంట్ల సైదులు, రమేష్‌, బంధన్‌నాయక్‌, సతీష్‌, నర్సిరెడ్డి సందర్శించిన వారిలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని