ఆసుపత్రుల అభివృద్ధిలో పురోగతేదీ?
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఆసుపత్రుల అభివృద్ధిలో పురోగతేదీ?


వైద్యాధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌, చిత్రంలో జేసీలు

 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో రూ. 185 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆసుపత్రుల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీఎంఎస్‌ఐడీసీ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు-నేడు పథకం కింద రూ. 185 కోట్లతో చేపట్టిన 33 పనులు సరైన పురోగతిలో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గతంలో కేవలం 15 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. దాన్ని 8,850 లీటర్ల యూనిట్‌ స్థాయికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటుకు దీటుగా పని చేస్తున్నాయని, కొవిడ్‌లో 1.70 లక్షల మంది రోగులకు చికిత్స అందించి.. వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాయని అభినందించారు. సమావేశంలో జేసీలు గణేష్‌కుమార్‌, విధేహ్‌ఖరే, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రభావతి, ఆర్‌ఎంవో డాక్టర్‌ కళారాణి, కొవిడ్‌ నోడల్‌ అధికారి నరేంద్ర, డీఈఈలు సాంబశివరావు, చంద్రమౌళి, మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధి కుమార్‌రెడ్డి, మణికంఠ సంస్థ ప్రతినిధి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ ప్రసూతీ మరణాలపైనా సమీక్ష జరిపారు.

ప్రభుత్వాసుత్రులకు జనరేటర్లు.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలు అందించడంలో వివిధ పరిశ్రమలు చూపుతున్న చొరవ అభినందనీయమని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అన్నారు. బుధవారం రాత్రి కృష్ణపట్నం నేషనల్‌ గ్యాస్‌ కంపెనీ ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రూ. 15 లక్షల విలువ చేసే సీఎస్‌ఆర్‌ నిధులతో మూడు 30 కేవీఏ కిర్లోస్కర్‌ జనరేటర్లకు సంబంధించిన పత్రాలను అందజేశారు. వాటిని కోట, కోవూరు, రాపూరు సీఎస్‌సీలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పరిశ్రమ ప్రతినిధులను అభినందించారు. జేసీ గణేష్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మావతి, ఎన్‌జీసీ సంస్థ సీఈవో పీవీ సుబ్రహ్మణ్యం, జీఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని