ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు


ప్రదర్శనగా వస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

 

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 42, 50లను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.సనత్‌, పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం నగరంలోని వీఆర్సీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో 1875లో ఏర్పడిన వీఆర్‌ విద్యాసంస్థలు కొంతమంది దాతల సహకారంతో ఇప్పటి వరకు నడిచాయని, ఎవరిని అడిగి కళాశాల, పాఠశాలను ఎత్తివేస్తారని ప్రశ్నించారు. ఇక్కడి హైస్కూలులో 230 మంది, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో 300 మందికిపైగా చదువుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో దాదాపు 28 ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు, సభ్యులు తేజ, సుల్తాన్‌, కృష్ణ, చిన్ని, గౌతం, నవీన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని