ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కుటుంబాలకు చెక్కుల పంపిణీ
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కుటుంబాలకు చెక్కుల పంపిణీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: కరోనా కాలంలో ముందుండి విధులు నిర్వర్తించి అసువులు బాసిన ఒక్కో పోలీసు కుటుంబ సభ్యులకు మ్యాన్‌కైండ్‌ ఫార్మాసంస్థ అందించిన రూ.3 లక్షల చెక్కును ఎస్పీ సీహెచ్‌ విజయరావు అందించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలతో రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ పాల్గొన్నారు. జిల్లాలో కొవిడ్‌తో మృతి చెందిన ఏఎస్సై నవీన్‌ కృష్ణ, హెడ్‌ కానిస్టేబుళ్లు పీవీ రమణయ్య, ఎం.రవి, సెబ్‌ కానిస్టేబుల్‌ కె.పోలయ్య, హోంగార్డు రామచంద్రయ్య కుటుంబాలకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో సెబ్‌ జేడీ కె.శ్రీలక్ష్మి, సెబ్‌ ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌.రవికుమార్‌, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని