రూ.4.5 లక్షల విలువైన గుట్కా, జర్ధా పట్టివేత
logo
Published : 11/06/2021 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.4.5 లక్షల విలువైన గుట్కా, జర్ధా పట్టివేత

పట్టుబడ్డ ప్యాకెట్లను చూపుతున్న పోలీసులు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: డిచ్‌పల్లి స్టేషన్‌ ప్రాంతంలో సీపీ కార్తికేయ ఆదేశాల మేరకు గురువారం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ షాకేర్‌అలీ, స్థానిక పోలీసులతో కలిసి ధనలక్ష్మి, రాందేవ్‌ హోల్‌సెల్‌ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.4.5 లక్షల విలువైన గుట్కా, జర్ధా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నర్సారామ్‌, శంకర్‌లాల్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. అయితే మండల కేంద్రంలో వ్యాపారులు చాలా ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో డంపు చేసి గ్రామాల్లోని దుకాణాలకు సరఫరా చేస్తూ రూ.లక్షలు కూడగట్టుకుంటున్నారు. పోలీసులు అడపాదడపా దాడులే పరిమితం కావడంతోదుకాణదారుల అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని