త్రుటిలో తప్పిన ప్రమాదం
eenadu telugu news
Published : 23/09/2021 05:07 IST

త్రుటిలో తప్పిన ప్రమాదం

తెగిన రైలు బోగీల క్లిప్పింగులు

విడిపోయిన బోగీ క్లిప్పింగులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: బోగీల అనుసంధానానికి ఉండే క్లిప్పింగులు ఊడిపోవడంతో గూడ్స్‌ రైలు రెండుగా విడిపోయిన ఘటన జిల్లా కేంద్రం శివారులో బుధవారం చోటు చేసుకుంది. నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న రైలు కామారెడ్డి శివారులోని రైల్వేగేటు సమీపంలోకి రాగానే క్లిప్పింగులు ఊడిపోయి బోగీలు విడిపోయాయి. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రైలును అక్కడే నిలిపివేశారు. ఒక్కసారిగా బోగీలు విడిపోవడంతో పట్టాలు కొంత దెబ్బతిన్నాయి. గంటపాటు ఇరువైపులా రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలును సికింద్రాబాద్‌ వైపు పంపించారు.

ట్రాక్‌ దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని