ఆసరా మరోసారి
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

ఆసరా మరోసారి

ఈ నెల 30 వరకు గడువు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం తాజాగా మరో అవకాశం ఇచ్చింది. 57 ఏళ్లు నిండిన వారు పింఛన్‌కు అర్హులని గతంలోనే ప్రకటించింది. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 31 వరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కాగా మరికొందరు అర్హులు మిగిలిపోవడంతో ఈ నెల 30 వరకు గడువు విధించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 46,364 దరఖాస్తులు వచ్చాయి. స్థానికంగా ఉండే మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వృద్ధుల వేలిముద్రలు సేకరిస్తారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుం చెల్లించవద్దని అధికారులు సూచించారు. ఎవరైనా రుసుం అడిగితే ఎంపీడీవో, మున్సిపల్‌, డీఆర్‌డీవో అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. 

వీరు అర్హులు
జనన-మరణ ధ్రువీకరణ, ఓటర్‌ కార్డు, పాఠశాలకు చెందిన ధ్రువీకరణ పత్రం ఇందులో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. ఆధార్‌కార్డులో ఉన్న వయసును పరిగణనలోకి తీసుకోరు. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50 లక్షల ఆదాయం, పట్టణ వాసులు రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలి.

వ్యవసాయ భూమి మూడెకరాల కన్నా తక్కువ ఉండాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారని డీఆర్‌డీవో పింఛన్‌ విభాగం ఏపీవో రాచప్ప తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని