గుట్కా విక్రయదారులపై కేసు నమోదు
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

గుట్కా విక్రయదారులపై కేసు నమోదు

పెద్దకొడప్‌గల్‌లో గుట్కాలు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

రామారెడ్డి: గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భువనేశ్వర్‌రావు శనివారం తెలిపారు. కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేయగా రామారెడ్డికి చెందిన భూంపల్లి గోపి, భట్టుతండాకు చెందిన శోభన్‌, లింబా నిషేధిత గుట్కా విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

పెద్దకొడప్‌గల్‌,పిట్లం: పిట్లం, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లోని పలు పాన్‌ , కిరాణా దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌, శిక్షణ ఎస్సై రాకేశ్‌ తెలిపారు.

మాచారెడ్డి: ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో . సుమారు రూ.20 వేల విలువైన గుట్కాలను స్వాథీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేశారు.

బిచ్కుంద : బిచ్కుందలో రూ.5 వేల విలువ చేసే గుట్కాను పట్టుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని