చీరాలలో జ్వరాల కట్టడికి చర్యలు
eenadu telugu news
Published : 16/09/2021 05:47 IST

చీరాలలో జ్వరాల కట్టడికి చర్యలు


ప్రకాష్‌నగర్‌లో బాలుడిని పరీక్షిస్తున్న డాక్టర్‌ జ్యోతీరావ్‌

చీరాల, న్యూస్‌టుడే: కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక సంఘ కమిషనర్‌ సీహెచ్‌ మల్లేశ్వరరావు తెలిపారు. దండుబాట శివారు ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలడంతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పలు ప్రాంతాల్లో దోమల నివారణకు ఎబేట్‌ పిచికారీ చేశారు. కాలువలను శుభ్రం చేయించారు. రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో బ్లీచింగ్‌ చల్లించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... వార్డు అడ్మినిస్ట్రేటివ్‌, శానిటరీ సెక్రటరీలు, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన జ్వర పీడితుల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రకాష్‌నగర్‌, శ్రీరామ్‌నగర్‌లో డాక్టర్‌ జ్యోతీరావ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. అయిదుగురు బాధితులను గుర్తించి చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్‌ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని