సత్వర న్యాయం అందించేందుకు కృషి
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

సత్వర న్యాయం అందించేందుకు కృషి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్‌ కుమార్‌ గోస్వామి

వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే గోస్వామి

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్‌ కుమార్‌ గోస్వామి కోరారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ కోర్టు ఫర్‌ ట్రయల్‌ ఆఫ్‌ ఏజెన్సీస్‌ అఫెన్స్‌స్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌, స్పెషల్‌ కోర్టు ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్స్‌స్‌ ప్రారంభోత్సవం, జిల్లా బార్‌ అసోసియేషన్‌ భవనం శంకుస్థాపన కార్యక్రమం శనివారం నిర్వహించారు. వీటిని అరుప్‌ కుమార్‌ గోస్వామి విజయవాడ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పరిపాలన న్యాయమూర్తి రావు రఘునందన్‌ రావు మాట్లాడుతూ జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులను అందించిందని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, అదనపు జిల్లా జడ్జిలు వెంకటేశ్వర్లు, పి.అన్నపూర్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు కె.నాగమణి, ఎం.అనురాధ, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఎం.శ్రీలక్ష్మి, కె.రాణి, డీఆర్‌వో బి.దయానిధి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, న్యాయమూర్తులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని